'నాన్నకు ప్రేమతో' రిలీజ్ ఎప్పుడో, ఆడియో రిలీజ్ ఎప్పుడో తనకి తెలీదని, అసలు ఏం జరుగుతుందనే దానిపై తనకి అవగాహనే లేదని ఒక విధమైన ఫ్రస్ట్రేటెడ్ ట్వీట్ వేసి సంచలనం సృష్టించాడు. అటుపై ఆ ట్వీట్ తనకి తెలీకుండా ఎవరో వేసారని, దాంతో తనకి సంబంధం లేదని చెప్పాడే కానీ 'నాన్నకు ప్రేమతో' రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అనేది అయోమయంగా మారింది. అసలే బాలకృష్ణ సినిమాతో దీనికి పోటీ వుండడంతో నందమూరి అభిమానుల్లోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం బాలయ్యని సపోర్ట్ చేస్తుంటే, మరో వర్గం ఎన్టీఆర్‌కి వత్తాసుగా నిలుస్తోంది. ఈగోస్ ఇష్యూగా మారిన టైమ్‌లో ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గినా కానీ ఆయా హీరోల అభిమానులకి తల కొట్టేసినట్టు అవుతుంది. డిక్టేటర్ రావడమనేది ఖాయమైంది.
ఇప్పుడు ఏ కారణం చేత నాన్నకు ప్రేమతో లేట్ అయినా కానీ బాలయ్యకి భయపడి జూనియర్ వెనక్కి పోయాడని అంటారు. ఇప్పటికే వెబ్ మీడియాలో కొందరు అలాంటి హర్ట్ చేసే ఆర్టికల్స్‌తో ఫాన్స్‌కి నరకం చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను నాన్నకు ప్రేమతో వాయిదా పడకూడదని ఎన్టీఆర్ అభిమానులు దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. కనీసం ఒక రెండు రోజుల్లో అయినా ఈ చిత్రం విడుదలకి సంబంధించి ఖచ్చితమైన వార్త వస్తుందని ఆశిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ విషయంలో ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్ టీమ్ కూడా సైలెంట్‌గానే వున్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్లు ఎలాంటి ప్రత్యేక ప్రయత్నాలు చేయకపోవడం ఫాన్స్‌ని మరింత కలవర పెడుతోంది.
No comments:
Post a Comment